జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ చెంగల నాగేశ్ తనకు దొరికిన సెల్‌ఫోన్, నగదును స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం అప్పగించాడు. నాగేశ్ కాకర్ల నుంచి గుండెపుడి మీదుగా తన ఆటో నడుపుకుంటూ జూలూరుపాడు వస్తుండగా మార్గ మధ్యలో వెంగన్నపాలెం శ్రీముత్యాలమ్మ గుడి సమీపంలో రోడ్డుపై సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని గమనించాడు. ఆటో ఆపి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా దాని పౌచ్‌లో రూ.1,500 నగదుఉన్నట్లు గుర్తించాడు. ఏమాత్రం ఆశపడకుడా జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరరావుకు సెల్‌ఫోన్, నగదును అప్పగించాడు. పోలీస్ సిబ్బంది విచారణ చేపట్టివెంగన్నపాలెంకు చెందిన దుద్దుకూరి నాగేశ్వరరావు ఫోన్‌గా గుర్తించి, ఆయనకు అందించారు. నిజాయితీని చాటిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అభినందించారు.


