అశ్వాపురం: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతోందని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పావనిగౌడ్ అన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌస్‌ను గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. స్థానిక రైతులకు కూడా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, నాయకులు కోడి అమరేందర్, మర్రి మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, గద్దల రామకృష్ణ, సర్పంచులు మర్రి సంధ్య, కోర్స అలివేలు, మండ్రు రామకృష్ణ. కోండ్రు సోమయ్య, మాజీ సర్పంచ్ కోడి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


