రుద్రంపూర్: చుంచుపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యాన సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ లెక్చరర్ విద్యార్థుల నుంచి రూ. మూడు వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేశాడని, బుధవారం నిర్వహించాల్సిన ల్యాబ్ పరీక్షను కూడా నిలివేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై ఎవరికై నా ఫిర్యాదు చేస్తే వారి ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై జిల్లా అధికారులు విచారణ జరిపి, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


