నాణ్యతతో న్యూట్రిమిక్స్‌ తయారీ | - | Sakshi
Sakshi News home page

నాణ్యతతో న్యూట్రిమిక్స్‌ తయారీ

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

భద్రాచలం: తృణధాన్యాల న్యూట్రి మిక్స్‌ ఆహార పదార్థాలను తగు నాణ్యతతో తయారు చేయాలని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌ అన్నారు. గురువారం ఆయన భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శ్రీ దమ్మక్క జాయింట్‌ లియాబిలిటీ న్యూట్రిమిక్స్‌ యూనిట్‌ను ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్‌, పీవీటీజీ అధికారి గన్యా నాయక్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు తృణధాన్యాల నాణ్యతను పరిశీలించాక వాటితో తయారు చేస్తున్న న్యూట్రిమిక్స్‌ ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఈమేరకు వారు నాణ్యతతో ఆహారపదార్థాలను తయారు చేయాలని, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మిల్లెట్‌ న్యూట్రిమోక్స్‌ సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసి నేరుగా భద్రగిరి మార్ట్‌కు ఎక్కువ శాతం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధితో రాణించటాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement