పదోన్నతి పొందిన దేవాదాయ శాఖ ఈఓలకు పోస్టింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

పదోన్నతి పొందిన దేవాదాయ శాఖ ఈఓలకు పోస్టింగ్‌లు

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

ఖమ్మంగాంధీచౌక్‌: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో గ్రేడ్‌–3 ఈఓ(కార్యనిర్వహణాధికారులు)లుగా ఉద్యోగోన్నతి పొందిన వారికి గురువారం ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం.హన్మంతరావు ఆధ్వర్యాన కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు పోస్టింగ్‌ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగ్నోతి పొందిన ఐదుగురికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో డి.శ్రీనివాసరెడ్డికి నేలకొండపల్లి మండలకేంద్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, పి.బేబీసరోజనకు ఖమ్మం ఇందిరానగర్‌లోని బాలగణపతి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం, డి.శ్రీనివాసరావుకు ఖమ్మం టేకులపల్లిలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయం గ్రేడ్‌–3 పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే, చుండూరు రామకోటేశ్వరరావును భద్రాద్రి జిల్లా ఇల్లెందు జేకే కాలనీలోని హరిహరక్షేత్రం, డి.విజయలక్ష్మిని పాత పాల్వంచలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఈఓగా నియమించారు. తొలుత ఐదుగురు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ మేకల వీరస్వామిని కలిసి జాయినింగ్‌ రిపోర్టులు ఇవ్వగా, కొత్త స్థానాల్లో రెండు, మూడు రోజుల్లో చేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement