●ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్
భద్రాచలం: ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజనులు స్వయం ఉపాధి పథకాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అధికారులు డేవిడ్ రాజ్, ఆనంద్ కుమార్, అశోక్, మధుకర్, సైదులు, సమ్మయ్య, రాంబాబు, ఉదయ్ కుమార్, వేణు, గన్యా, మనిధర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో 16మంది
ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
●ఉమ్మడి జిల్లా నుంచి ఏడుగురు
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా 12 ఏరి యాల నుంచి 16 మందిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. విధుల్లో నిబద్ధత, ప్రమాదాలకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తున్న వారిని ఎంపిక చేశామని జీఎం(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్‌ఆర్ కె. అజయ్‌కుమార్ తెలిపారు. వీరిని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సన్మానించునున్నట్లు వెల్లడించారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాస్(ఏజీఎం–మణుగూరు ఏరియా), లకావత్ అశోక్(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇల్లెందు ఏరియా), జి.లక్ష్మీనారాయణ(హెచ్‌ఓఎం, కొత్తగూడెం ఏరియా), భూక్యా రాంబాబు(డీవైఎస్‌ఈ, సత్తుపల్లి ఏరి యా), పి.మురళీకృష్ణ(జీఎం–కార్పొరేట్), ము కుంద సత్యనారాయణ(డీజీఎం, కార్పొరేట్), ఎన్.కుమారస్వామి(ఫోర్‌మెన్, కార్పొరేట్) ఉన్నారు.
అవినీతిపరులకు మోదీ అండ
●మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
ఇల్లెందు: అవినీతి పరులకు, రేపిస్టులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సోమవారం ఇల్లెందులోని ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అదానీ, అంబానీలను తన వెంట తిప్పుతూ మరింత ధనవంతులుగా మార్చుతున్నారని విమర్శించారు. అగ్రరాజ్య దురాక్రమణపరుడు ట్రంప్, ఫాసిస్టు విధానాలు అవలంబించే మోదీ ఇద్దరు ప్రజావ్యతిరేకులేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్నలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, నాయకులు నాయిని రాజు, శ్రీరాం కోటయ్య, ఈసం శంకర్, ఆర్.బోసు, ప్రసాద్, పగడయ్య, అజ్మీర బిచ్చా, బుర్ర వెంకన్న, యాకుబ్‌షావళి తదితరులు పాల్గొన్నారు.
సింగరేణిలో 8 మంది
వైద్యాధికారుల బదిలీ
రుద్రంపూర్: సింగరేణి సంస్థ పరిధిలోని వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 8 మంది వైద్యాధికారులను బదిలీచేస్తూ యాజమాన్యం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం ఏరియా మెయిన్ వర్క్‌షాపులో ఫిజిషియన్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న ఎల్తూరి రాజు ఆర్జీ–1 ఏరియా ఆస్పత్రికి, కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రిలో డిప్యూటీ సీఎంవోగా పనిచేస్తున్న జీఎన్ కృష్ణవేణి రుద్రంపూర్ ఆస్పత్రికి, మణుగూరు ఏరియాలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పి.శేషగిరిరావు కొత్తగూడెం మెయిన్ ఆస్పత్రికి, బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో డీవైఎంఎస్‌గా పనిచేస్తున్న మైకం మురళీమోహన్ ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి బదిలీ అయ్యారు. వీరితో మరో నలుగురిని కూడా యాజమాన్యం బదిలీ చేసింది. వీరంతా ఈ నెల 8వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


