టూ పోస్ట్ హైడ్రాలిక్
వెహికల్ లిఫ్టర్ ప్రారంభం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా కృషి చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమానితులకు గంజాయి రాపిడ్ కిట్‌ల ద్వారా పరీక్షించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. డయల్ 100కు ఫోన్ రాగానే త్వరితగతిన స్పందించాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, మల్లయ్యస్వామి, అరుణ్ కుమార్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ మోటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన టూ పోస్ట్ హైడ్రాలిక్ వెహికల్ లిఫ్టర్‌ను అధికారులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ పరికరం ద్వారా ఇంజన్, గేర్ బాక్స్ రిపేర్లను సులభంగా చేయవచ్చని అధికారులు తెలిపారు.
ఎస్పీ రోహిత్ రాజు


