నేను గీసిన చిత్రం
సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు ● నచ్చిన రంగంలో నైపుణ్యం దిశగా అడుగులు
కాలాన్ని వృథా చేయకుండా పోటీపడి ఎవరైతే సద్వినియోగపర్చుకుంటారో వారు జీవితంలో ఉన్నతస్థాయికి చేరతారు. ఈ క్రమంలోనే వేసవి సెలవుల్లో ఖాళీగా
ఉండకుండా ఆసక్తి ఉన్న కోర్సులు, కళలను నేర్చుకుంటే పిల్లలకు భవిష్యత్‌లో ప్రయోజనం ఉంటుంది. ఈ దిశగా పలువురు చిన్నారులు ప్రస్తుత సెలవులను సద్వినియోగం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తూ
నృత్యం, ఆటపాటలు, డ్రాయింగ్, పెయింటింగ్, సంగీతం తదితర రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. – ఇల్లెందురూరల్
క్రికెట్
శిక్షణలో బాలుడు
నాకు చిత్రలేఖనంపై మక్కువ. సెలవుల్లో సాధన చేసి నైపుణ్యం పెంచుకున్నాను. మరిన్ని మంచి చిత్రాలు గీసి గుర్తింపు సాధించాలనేది లక్ష్యం. ఈ సెలవుల్లో చేసిన సాధన, నేర్చుకున్న మెళకువలతో లక్ష్యాన్ని చేరతాననే నమ్మకం కలిగింది.
–బొంగాని జైత్విక్, 7వ తరగతి, సుభాష్‌నగర్
చిన్నతనం నుంచి క్రికెట్ అంటే మహా ఇష్టం. స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాను. నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకే వేసవి శిబిరానికి హాజరయ్యా. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్‌లో మెళకువలు తెలిశాయి.
–సాయివర్షిత్, పదో తరగతి,
ఇందిరానగర్
క్యారమ్స్ అడుకుంటున్న చిన్నారులు
సైకిల్ నేర్చుకుంటున్న బాలిక


