కాస్త మెత్తగా.. పుచ్చులు త్వరగా.. | - | Sakshi
Sakshi News home page

కాస్త మెత్తగా.. పుచ్చులు త్వరగా..

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

‘సన్న’గా పక్కదారి

లబ్ధిదారుల్లో నానాటికీ సన్నగిల్లుతున్న ఆసక్తి

ఫలితంగా రంగంలోకి దళారులు

దారి మళ్లకుండా..

పౌర సరఫరాల శాఖ ద్వారా తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికే కాక ఆహార భద్రత, అంత్యోదయ కార్డుల ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే, గతంలో బియ్యం దొడ్డుగా ఉండడంతో చాలామంది ఆహారంలో భాగంగా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఈ బియ్యం దళారుల ద్వారా కోళ్లఫారాల్లో దాణాగా చేరడం మొదలైంది. అంతేకాక కొన్నిచోట్ల మిల్లర్లు దక్కించుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సరఫరా చేశారు. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వడం ప్రారంభించింది.

ప్రచారం చేసిన సీఎం!

ఏడాది కాలంగా రేషన్‌ లబ్ధిదారులకు నన్న బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. బియ్యం నాణ్యత బాగుండడంతో అందరూ వినియోగించడం ప్రారంభించారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి 2025 ఏప్రిల్‌ 6న సారపాకలోని లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నమే తినడం ద్వారా మరింత ప్రచారం ఏర్పడింది. ఫలితంగా పక్కదారి పట్టడం దాదాపు ఆగిపోయింది. అయితే, ఆరు నెలల తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రేషన్‌షాపుల్లో ఇచ్చే సన్నబియ్యం వండితే మెత్తగా కావడం, త్వరగా పురుగులు పడుతోందని తెలిసినా యంత్రాంగం దృష్టి సారించలేదు.

దృష్టి సారించకపోతే...

నాణ్యత తగ్గిపోతుండడంతో లబ్ధిదారులకు సన్నబియ్యంపై ఆసక్తి తగ్గుతుందని తెలిసినా అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సన్న బియ్యానికి సంబంధించి 32 రకాలు పండిస్తున్నా అత్యంత నాణ్యమైన బీపీటీ రకానికి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. దీంతో ఈ రకాన్ని పండించిన రైతులు ఎక్కువ మంది ప్రైవేట్‌ వ్యాపారులకే అమ్ముతున్నారు. ఒకవేళ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరినా తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్లలో ఏడాది కాలంగా నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి అవి సన్నబియ్యాన్ని సైతం ఆశిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా సన్నబియ్యం సాగు మొదలు పంపిణీ వరకు అధికారులు శ్రద్ధ పెట్టకపోతే ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న పథకానికి చెడ్డపేరు వచ్చే అవకాశముంది.

ప్రస్తుతం షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ముగ్గురు లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి నెలకు 18కిలోల చొప్పున మూడు నెలలకు సంబంధించి 54కిలోల బియ్యం వస్తుండడంతో వాడుకోలేని పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. బియ్యం పురుగు పడుతుండడం, నూకలు ఎక్కువగా ఉండడమే కాక ఎంత జాగ్రత్త పడినా అన్నం మెత్తగా అవుతుండడంతో లబ్ధిదారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఏళ్ల తరబడి రేషన్‌ బియ్యం దందా సాగించిన దళారులు రంగంలోకి దిగారు. పాత పరిచయాలు, నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఇది ప్రచారమేనని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు కొట్టి పారేసినా ఇటీవల పలుచోట్ల బియ్యం పట్టుబడడం గమనార్హం. జిల్లా కేంద్రంలోనే లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించేందుకు వెళ్తున్న ట్రాలీఆటో గత నెల చివరలో ప్రమాదానికి గురవడంతో విషయం బయటకు పొక్కింది. అంతేకాక ఈనెలారంభంలో టేకులపల్లిలో రేషన్‌ బియ్యం తరలిస్తున్న మరో ఆటో పట్టుబడింది.

సన్న బియ్యంపై జనాల నిర్లిప్తత !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement