మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు భావించాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ సూచించారు. చుంచుపల్లిలోని షీ టీమ్స్‌, ఏహెచ్‌టీయూ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. మహిళలు వారికి ఎదురయ్యే లైంగిక వేధింపులు, ర్యాగింగ్‌, బ్లాక్‌ మెయిలింగ్‌పై షీ టీమ్స్‌ను సంప్రదించొచ్చని తెలిపారు. నేరుగా రాలేకపోతే 87126 82131 నంబర్‌కు ఫోన్‌ చేసినా సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. నిందితులను పిలిచించి తొలుత కౌన్సెలింగ్‌ ఇస్తారని, పరిస్థితి తీవ్రత ఆధారంగా కేసు నమోదు చేస్తారని చెప్పారు. కాగా, షీ టీమ్స్‌ సిబ్బంది రద్దీ ప్రదేశాల్లో గస్తీ కాస్తూ మహిళలు, విద్యార్థినులకు భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్‌, ఏఎస్సై నాగయ్య, సభ్యులు మల్లికాంబ, రాంబాబు పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement