కరకగూడెం/చండ్రుగొండ: అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉండడం ద్వారా ఆపద లో ఉన్న వారి ప్రాణాలకు రక్షణ లభిస్తుందని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ ఆఫీసర్ కిషోర్ తెలిపారు. మండలంలోని జానంపేట, కరకగూడెంల్లో 108 వాహనాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, మందుల లభ్యతను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్, ఈ ఎంటీలు, పైలట్లు బట్టా సుమలత, పుల్లయ్య, రమ్యకృష్ణ, గాడిపల్లి సాయి, సాంబశివరావు, తేజ పాల్గొన్నారు. అలాగే, చండ్రుగొండలోని 108 ఆంబులెన్స్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. సెంట్రల్ ఆఫీసర్ ఫయాజ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
రిటైర్డ్ సేల్స్‌మెన్‌తో బియ్యం పంపిణీ
పాల్వంచరూరల్: ఉద్యోగవిరమణ చేసిన జీసీ సీ సేల్స్‌మెన్ తిరిగి బియ్యం పంపిణీ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బ్రాంచ్ పరిధిలోని కిన్నెరసాని, ఉల్వనూరు గ్రామాల్లో సేల్స్ డిపోలకు లక్ష్మణ్ సేల్స్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, డిసెంబర్ 31న ఉల్వనూరు సేల్స్‌మెన్ వెంకట్రావు ఉద్యోగ విరమణ చేయ గా, ఆయనతో కిన్నెరసాని సేల్స్‌మెన్‌గా లక్ష్మణ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈనెల రేషన్ బియ్యం పంపిణీ కిన్నెరసానిలో వెంకట్రావు నేతృత్వాన చేపట్టగా, అవకతవకలు జరిగితే ఎవరు బాధ్యులనేది చర్చనీయాంశంగా మా రింది. ఈ విషయమై జీసీసీ మేనేజర్ లక్ష్మణ్ వివరణ కోరగా.. రిటైర్డ్ ఉద్యోగితో పనిచేయించిన విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొండికట్ట బీట్‌లో
భూమి పరిశీలన
పాల్వంచరూరల్: గతంలో ఆక్రమణకు గురై తిరిగి అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిని రాష్ట్ర ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్‌ఓ రాజశేఖర్ మంగళవారం పరిశీలించారు. పాల్వంచ మండలం యానంబైల్ రేంజ్‌లోని మొండికట్ట బీట్‌లో గతంలో అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసు కోగా పరిశీలించిన డీఎఫ్‌ఓ.. ఆ తర్వాత కిన్నెరసాని డీర్‌పార్కులో అభివృద్ధి పనులను సైతం పరిశీలించారు. పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ ఎఫ్‌డీఓ బి.బాబు, రేంజర్లు కవిత, మాధవి, సెక్షన్ ఆఫీసర్ కిషన్ పాల్గొన్నారు.
కారు డ్రైవర్‌కు
ఏడాదిన్నర జైలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. జూలూరుపాడు మండలం పడమటినర్సాపురానికి చెందిన నాచబోయిన ప్రశాంత్ ఇంట్లో తల్లిదండ్రులు నాచబోయిన వెంకన్న– లలిత 2016 ఏప్రిల్ 21న రాత్రి నిద్రిస్తున్నారు. పాల్వంచకు చెందిన నందిగామ పవన్‌కుమార్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఇంట్లోకి దూసుకెళ్లగా లలిత తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అంతకుముందు మాచినపేటకు చెందిన లాకావత్ సాయికుమార్, బోడా అశోక్‌కుమార్ బైక్‌ను సైతం పవన్ తన కారుతో ఢీకొట్టగా గాయపడ్డారు. ఘటనపై అప్పటి ఎస్‌ఐ పి.శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ కె.రాందాస్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు 14 మంది సాక్షులను విచారించాక పవన్‌కుమార్‌కు ఏడాదిన్నర జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బి.విశ్వశాంతి వాదించగా, ఎస్‌ఐ డి.రాఘవయ్య, పీసీ ఉపేందర్‌రావు సహకరించారు.


