ఆస్పత్రులకు అవార్డుల పంట | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రులకు అవార్డుల పంట

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

చుంచుపల్లి/భద్రాచలం అర్బన్‌/మణుగూరు టౌన్‌/దుమ్ముగూడెం/పాల్వంచ :ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులు, వైద్యులు, ఉద్యోగులకు అవార్డులు ప్రకటించగా జిల్లా సత్తా చాటింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్యసేవలు అందించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఈమేరకు సీహెచ్‌సీ పాల్వంచకు చెందిన డాక్టర్‌ శైలేష్‌ కుమార్‌, డాక్టర్‌ పి.రామ్‌ప్రసాద్‌, భద్రాచలం ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణతో పాటు డాక్టర్‌ క్రాపా విజయ్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ కృష్ణవేణి, ఏ.వెంకటరావు జాబితాలో ఉన్నారు. అలాగే, మణుగూరు ఏరియా హాస్పిటల్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ మానస, ఫార్మసిస్ట్‌ ఏ.శారదాదేవి అవార్డులు అందుకున్నారు. అంతేకాక భద్రాచలం, మణుగూరు, చర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇన్‌ ట్రైబల్‌ ఏరియా’ విభాగంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రామకృష్ణ, గౌరీప్రసాద్‌, సాయివర్ధన్‌తో కలిసి డీసీహెచ్‌ఎస్‌ జి.రవిబాబు అవార్డులు స్వీకరించారు. ఇక దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పీహెచ్‌సీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీగా ఎంపిక కాగా డాక్టర్‌ రేణుకా రెడ్డి అవార్డు స్వీకరించారు.

రాష్ట్రస్థాయిలో

జిల్లాకు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement