పాల్వంచ/పాల్వంచరూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజానీకానికి నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారిలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినో త్సవం సందర్భంగా పాల్వచంలోని వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరో గ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యాన అందరూ బాధ్యతగా భావించాలన్నారు. ఇతర జిల్లాలతో పోలి స్తే మంచి పేరు ఉన్నప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన సేవలతో రాష్ట్ర, జాతీయఅవార్డులు సాధించాలని తెలి పారు. అనంతరం డీఎంహెచ్‌ఓ తుకారాంరాథోడ్ మా ట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతు న్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఆతర్వాత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ప్రతి భ కనబరిచిన 43 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రసాద్‌నాయక్, వైద్యులు స్పందన, తేజస్విని, ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


