నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఇంజనీరింగ్ పనులపై సమీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): విపత్తులపై సరైన అవగాహనతోపాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని కలెక్టర్ అంకిత్ అన్నా రు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ ఫామెక్స్ నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. విపత్తులకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, విపత్తు నిర్వహణ ప్రణాళిక అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచా యతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, వ్యవసాయ తదితర శాఖల సమన్వయంపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి 15 రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్‌స్పెపెక్టర్ బిటన్‌సింగ్, బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ విధానాలను సమగ్రంగా పరిశీలించి, రిజిస్టర్‌లో సంతకం చేశారు.
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ..
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు. అర్హులు pmsuryaghar. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జూలూరుపాడు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యసిబ్బందిని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడు ప్రభు త్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. మందుల నిల్వలు, వైద్యులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ కేసుల నమోదును గుర్తించిన కలెక్టర్ ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలివేంద్రాలు, ఉపాధి పనిప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన జెడ్పీ సీఈ ఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వైద్య శాఖాధి కారి తుకారాం రాథోడ్, విద్యుత్ ఎస్‌ఈ జి మహేందర్, టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి.అజయ్ కుమార్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్
జిల్లాలో వివిధశాఖల పరిధిలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, రోడ్లు–భవనాలు, ట్రైబల్ వెల్ఫేర్, విద్యుత్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ అనుమతులు, భూసంబంధిత సమస్యలు వంటి ఆటంకాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. రహదారుల నిర్మాణం, ఇందిర మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా పాఠశాలలు, సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలు, పంప్ హౌస్‌లు తదితర పనులను సమయానికి పూర్తిచేయాలని సూచించారు. అధికారులు అర్జున్ రావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, తిరుమలేష్, నళిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


