ఎకై ్సజ్‌లో బదిలీల గందరగోళం | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌లో బదిలీల గందరగోళం

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

● నాలుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫర్లు ● నేటితో ముగియనున్న ఆప్షన్ల గడువు ● కుటుంబాలకు దూరమవుతామని సిబ్బంది ఆవేదన

● నాలుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్‌ఫర్లు ● నేటితో ముగియనున్న ఆప్షన్ల గడువు ● కుటుంబాలకు దూరమవుతామని సిబ్బంది ఆవేదన

ఖమ్మంక్రైం: ఎకై ్సజ్‌ శాఖ ఉద్యోగుల బదిలీల్లో 317 జీవో గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎకై ్సజ్‌శాఖలోని హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బదిలీల ప్రక్రియ మొదలుకావడంతో ఉద్యోగులు ఆనందపడ్డారు. కానీ ఈ జీఓ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని వాపోతున్నారు.

నాలుగు జిల్లాల పరిధి

2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎకై ్సజ్‌ శాఖలో 317 జీఓను అమల్లోకి తెచ్చింది. ఈ జీఓ ప్రకారం సీడీ(4) కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలు ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఎక్కడైనా బదిలీ చేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాలే కాక ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నా.. ఉమ్మడి జిల్లాను వీడి వెళ్లాల్సి రానుండడంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

41 స్టేషన్లకు ఆప్షన్‌

ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్‌ కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు పెట్టుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. కాగా, నాలుగు జిల్లాలో 44 ఎకై ్సజ్‌ స్టేషన్లు ఉండగా.. ఉద్యోగులు 41 స్టేషన్లకు ఆప్షన్‌ పెట్టుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో సిబ్బంది ఆప్షన్లు నమోదు చేస్తున్నా ఏ జిల్లాకు బదిలీ అవుతుందోనని ఉత్కంఠకు లోనవుతున్నారు. కాగా, ఆప్షన్ల పరిశీలన అనంతరం 133 మంది కానిస్టేబుళ్లు, 32 హెడ్‌కానిస్టేబుళ్లకు ఈనెల 10వ తేదీన బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి.

పైరవీలు ప్రారంభం

317 జీఓపై అవగాహన లేదని చాలా మంది ఎకై ్సజ్‌ సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఖమ్మంలో పని చేసిన వారు భద్రాద్రి జిల్లాకు, భద్రాద్రి జిల్లాలో పనిచేసిన వారు ఖమ్మంకు బదిలీపై వచ్చారు. అయితే జీఓ 317 ప్రకారం ఖమ్మం ఎకై ్సజ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ను భద్రాద్రి జిల్లాకు కాకుండా వరంగల్‌ లేదా హనుమకొండ జిల్లాకు బదిలీ చేసినా తప్పక వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే కుటుంబం, పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని, తద్వారా ఇబ్బంది వస్తుందని తల పట్టుకుంటున్నారు. ఈనేపథ్యాన కొందరు తమకు తెలిసిన ఎకై ్సజ్‌ ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. పని చేస్తున్న ప్రాంతంలోనే మరో స్టేషన్‌కు బదిలీ చేయాలని, లేకపోతే పక్క జిల్లాకు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇంకొందరు రాజకీయ నాయకుల ద్వారా కూడా పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, ఎలాంటి పైరవీలకు తావు లేదని, ఎక్కడకు బదిలీ చేసిన వెళ్లాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement