ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

చుంచుపల్లి: బీజేపీ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి జెండా ఎగరవేసి మాట్లాడారు. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటమే బీజేపీ లక్ష్యమని, మోదీజీ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవీకే మనోహర్‌, బలగం శ్రీధర్‌, పైడిపాటి రవీందర్‌, వెంకన్న నాయక్‌, జల్లారపు శ్రీనివాస్‌, సముద్రాల గాయత్రి, ధారావత్‌ విష్ణు ప్రియ, జజ్జూరు మోహన కృష్ణ, రమణ, నరహరి బండి వీరస్వామి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌గా శ్యామ్‌కుమార్‌

ఖమ్మంవ్యవసాయం: మార్క్‌ఫెడ్‌ సంస్థ రాష్ట్రంలోని 13మంది మేనేజర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్‌ సునీతను సిద్దిపేటకు బదిలీ చేశారు. అలాగే, హనుమకొండ జిల్లా మేనేజర్‌ ఐ.శ్యామ్‌కుమార్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లా మేనేజర్‌గా బదిలీ చేయడంతో పాటు మహబూబా బాద్‌ జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించా రు. ఈమేరకు శ్యామ్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, మొక్కజొన్నకొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు.

హైటెక్‌ వ్యభిచారం?

ఫొటోలతో బ్లాక్‌ మెయిల్‌కు

పాల్పడుతున్న మహిళ

పాల్వంచ: పట్టణానికి చెందిన ఓ మహిళ ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలు, విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరానగర్‌కాలనీకి చెందిన సద రు మహిళ ధనికవర్గాలు నివసించే కాంట్రాక్టర్స్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ వ్య వహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలు, విద్యార్థినులకు మాయమాటలు చెబుతూ రొంపిలోకి దింపుతున్నట్లు సమాచారం. వారి ఫొటోలను తీసుకుని, తిరిగి వారినే బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ, భారీ ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ వీడి యో కాల్స్‌ ద్వారా హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు, మహిళలను చూపించి విటులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేసి, బాధితులకు నామమాత్రపు సొమ్ము ఇచ్చి మిగిలినదంతా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కిలాడీ మహిళ వేధింపులు తాళలేక ఓ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

వృద్ధురాలి మెడలో

బంగారు గొలుసు చోరీ

బూర్గంపాడు: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు భూక్యా రుక్మిణమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును ఆదివారం రాత్రి దొంగలు అపహరించారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా, గొలుసు చోరీ చేశారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement