చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

పాల్వంచరూరల్‌: కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామంలో నివాసం ఉంటున్న రజినీ ఆదినారాయణ(25)ఈ నెల 4న పురుగుల మందుతాగాడు. కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ పోలీసులకు సమాచారం అందించింది.

వడదెబ్బతో వ్యక్తి..

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పట్టణంలోని అశోక్‌నగర్‌ కొత్తకాలనీకి చెందిన శివకుమార్‌ రెడ్డిగా గుర్తించారు. ఇటీవల మద్యానికి బానిసగా మారాడని, ఈ క్రమంలో అతిగా మద్యం తాగి ఎండదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు చుక్కా శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఐ శ్యాంప్రసాద్‌ కేసు నమోదు చేశారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య

అశ్వాపురం: Ð]l$…yýlÌS MóS…{§é-°MìS ^ðl…¨¯]l K Ð]lÅMìS¢ ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éW B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$-¯é²yýl$. AÔ>Ó-ç³#-Æ>°MìS ^ðl…¨¯]l } §ýl$Æý‡Y IÆý‡¯Œl àÆŠḥzÐólÆŠḥ Ķæ$fÐ]l*° MýS…§ýl$ÌS Ð]l$«§ýl$-çÜ*-§ýl¯Œl Æ>Ð]l# (46) D ¯ðlÌS 4¯]l ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éV>yýl$. ©…™ø MýS$r$…½MýS$-Ë$ QÐ]l$Ã… Bçܵ-{†MìS ™èlÆý‡-Í…^éÆý‡$. ç³Çíܦ† ÑçÙ-Ð]l$…-V> Ð]l*Ç _MìS-™èlÞMýS$ ÔèæÈÆý‡… çÜçßæ-MýS-Ç…^èlyýl… Ìôæ§ýl° OÐðl§ýl$Å-Ë$ ™ðlÌS-ç³-yýl…-™ø C…sìæMìS ¡çÜ$-MýS$-Æ>V>, B¨ÐéÆý‡… Æ>{† Ð]l$–† ^ðl…§éyýl$. Ð]l$–™èl$yýl$ Ýù§ýl-Æý‡$yýl$}°ÐéçÜ-Æ>Ð]l# íœÆ>Å-§ýl$-™ø MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ-¯]lr$Ï ïÜI AÔZMŠSÆð‡yìlz ™ðlÍ´ëÆý‡$.

రెండు బైక్‌లు ఢీ : ఇద్దరికి గాయాలు

పాల్వంచరూరల్‌: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డ ఘటన మండలంలోని రంగాపురం వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం నకిరిపేటకు గ్రామానికి చెందిన ఎన్‌.లింగయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమసయంలో జింకలగూడేనికి చెందిన ఎస్‌కె.రెహమాన్‌ మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రంగాపురం శివారు కిన్నెరసాని వాగు బ్రిడ్జి వద్ద రెండ్‌ బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. లింగయ్యకు తీవ్ర గాయాలుకాగా, కొత్తగూడెం తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement