అశ్వారావుపేటరూరల్: బ్చంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరై, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే బావ, బామ్మర్ది దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం తాటి రామన్నగూడేనికి చెందిన మడకం సంతోష్ (19), తనకు కాబోయే బావ పండు సందీప్ (20) ఆదివారం ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ చిచ్చొడిగుంపులోని సంతోష్ మేనమామ చిచ్చొడి సత్తిపండు కుమార్తె మొదటి జన్మదిన వేడుకలకు హాజరయ్యా రు. అనంతరం సంతోష్, సందీప్ కలిసి తమ స్వగ్రా మానికి బైక్‌పై వెళ్తుండగా మండలంలోని గాండ్లగూడెం శివారులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో సంతోష్, సందీప్ అక్కడికక్కడే దుర్మర ణం చెందారు. ఎస్‌ఐలు యయాతిరాజు, అఖిల ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ప్రభు త్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అఖిల తెలిపారు.
తీరని విషాదం..
సంతోష్, సందీప్ మరణంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంతోష్‌కు తల్లిదండ్రులు మడకం విజయ, నాగేశ్వరరావు, అక్క ఉంది. సంతోష్ అక్కను సందీప్ ప్రేమిస్తుండగా, త్వరలోనే పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సందీప్ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నర్సమ్మ సైతం కన్నీటిపర్యంతమయ్యారు.
కాబోయే బావ, బామ్మర్దుల దుర్మరణం


