ఆర్టిజన్లకు భరోసా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్లకు భరోసా కల్పించాలి

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

పాల్వంచ: ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ వర్తింపజేసి, విద్యు త్‌ సంస్థల్లో పనిచేస్తున్న 19వేల మంది ఆర్టిజన్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని పలువురు రాజకీయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు అన్నారు. శనివారం కేటీపీఎస్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో టీవీఏఈ జేఎసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను ఆర్టి జన్లుగా గుర్తించినా బ్రిటీష్‌ కాలం నాటి స్టాండింగ్‌ ఆర్డర్‌ను అంటగట్టి తీవ్రఅన్యాయం చేశారని ఆరో పించారు. ఈ నెల 7వ తేదీలోగా డిమాండ్లను పరి ష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హె చ్చరించారు. ధర్నాకు కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కార్పొరేటర్లు భట్టు లలిత, చెరకు భాగ్యలక్ష్మి, టీఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎ.జలీల్‌, సీపీఐ నాయకులు పూర్ణచందర్‌రావు, నిమ్మల రాంబాబు, రాహుల్‌, గౌని నాగేశ్వరరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు చారు గుండ్ల రమేష్‌, రాధాకృష్ణ, అంకిరెడ్డి నరసింహారావు, రావుల మురళి, గొర్రె వేణుగోపాల్‌, పూరపాటి రమేష్‌, జేఏసీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, సాయిలు, శ్రీధర్‌ గౌడ్‌, చందర్‌ సింగ్‌ ఠాగూర్‌, శారద తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో రాజకీయ, జేఏసీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement