సూపర్‌బజార్(కొత్తగూడెం): పోటీల నిర్వహణ ద్వారానే క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరం సాధన గ్రౌండ్‌లో శనివా రం జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నైపుణ్యం కలిగిన అథ్లెట్లు ఉన్నారని, రెండుసార్లు రాష్ట్ర సీఎం కప్ చాంపియన్‌షిప్ సాధించాని గుర్తుచేశారు. కార్పొరేటర్లు ఎర్రవెల్లి శంకర్, కూరపాటి సుధాకర్ రాజు, ఆకునూరి సుప్రియ, మునిగడప పద్మ మాట్లాడుతూ క్రీడాలఅభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మాట్లాడుతూ ఈ నెల 11న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం బహుమతులను ప్రదానం చేశారు. సీనియర్ క్రీడాకారుడు మోరె రమేష్, అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ డి.మల్లికార్జున్, కోచ్‌లు రియాజ్ పాషా జొన్నగిరి ప్రసాద్, పవన్, పీడీ శ్వేత, రామవరం వర్తక సంఘం బాధ్యులు జాకీర్, సుభాష్, ముస్తఫా పాల్గొన్నారు.
జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి
పరంధామరెడ్డి


