ఐఎన్‌టీయూసీ నేతకు డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఎన్‌టీయూసీ నేతకు డాక్టరేట్‌

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

సుపారీ తీసుకుని వ్యక్తిపై దాడి

రుద్రంపూర్‌: ఐఎన్‌టీయూసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌కు డాక్టరేట్‌ లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి గాను ఆయనకు జీహెచ్‌ఆర్‌టీ ఇండియా సంస్థ ఆధ్వర్యాన డబ్ల్యూఈబీబీఐసీ – ఏఐయూ యూనివర్సిటీ ల సంయుక్త ఆధ్వర్యాన గౌరవ డాక్టరేట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరి గిన కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్‌ అందుకున్నారు.

85 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

టేకులపల్లి: అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలపై రెవెన్యూ అధికారులు దాడిచేసి 85 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా.. టేకులపల్లి మండలం బోడులో రేషన్‌ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేటలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు శివకుమార్‌, మహేష్‌, ప్రభాకర్‌లు శనివారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదా ల్లో గ్రామానికి చెందిన ఇరుప సమ్మయ్య నివా సంలో అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా.. బి య్యం నిల్వలు గౌతమ్‌కు చెందినవి కావడంతో ఆయనపై అధికారులు కేసు నమోదు చేశా రు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేదల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన బియ్యాన్ని సంబంధిత శాఖకు అప్పగించి, తదుపరి విచారణను వేగవంతం చేశారు.

లారీ డ్రైవర్‌పై కేసు నమోదు..

పాల్వంచరూరల్‌: మండల పరిధి నాగారం కాలనీ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు దాడుతున్న గుర్రం దుర్గాప్రసాద్‌(48)ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ శనివారం ఫి ర్యాదు చేయగా.. లారీడ్రైవర్‌ సువర్ణపాక రవితేజ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

కొత్తగూడెంఅర్బన్‌: ఆస్తి తగాదాల నేపథ్యాన సుపారీ తీసుకున్న వ్యక్తులు ఒకరిపై దాడి చేసిన ఘటన ఇది. కొత్తగూడెం గొల్లగూడెంకు చెందిన రాము శుక్రవారం రాత్రి డయాలసిస్‌ చేయించుకుని ఇంటికి వెళ్తుండగా భావన బార్‌ దగ్గర మేదరబస్తీకి చెందిన సంతోష్‌, చింటూ ఆపి వాహన లిఫ్ట్‌ అడిగి ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లాక దాడి చేశారు. ఆ సమయాన స్పృ హ కోల్పోయిన రాము తేరుకున్నాక త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాము బంధువుల వద్ద సంతోష్‌, చింటూ సుపారీ తీసుకొని దాడి చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement