ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కన్పించడంతో మైబూబ్‌నగర్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో కొద్దిరోజలుగా ఈ అంశం వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇంటి సమీపంలో నిమ్మకాయులు, పసుపు, కుంకుమ, బియ్యం, ఎండు మిరపకాయలు, మేకు లు తదితరాలు దర్శనమివ్వడంతో కుటుంబీకులతోపాటు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకూ గస్తీకాసి, నిద్రకు ఉపక్రమించగా, శుక్రవారం తెల్లవారేలోగా కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు వేసినట్లు కని పించాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఎస్‌ఐ విజయసింహారెడ్డిని సంప్రదించగా, ఘటనా ప్రదేశాన్ని సందర్శించానని, క్షుద్రపూజలేవీ చేయలేదని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలో పసుపు, కుంకుమ తదితరాలు వేస్తున్నారని, విచారణ చేపట్టామని పేర్కొన్నారు.


