చుంచుపల్లి: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. గురువారం ఆయన చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌పైన ఉన్న డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, అశోక్, సీఐ జితేందర్, చుంచుపల్లి ఎస్సైలు రవి, ఉమ, జుబేదా పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు


