గిరిజన విద్యార్థులు వృద్ధిలోకి రావాలి | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థులు వృద్ధిలోకి రావాలి

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

స్కూల్‌ భవనాన్ని ప్రారంభించిన

ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ

పాల్వంచరూరల్‌: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలకు చేరాలని ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌శర్మ అన్నారు. పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధి కొయ్యగట్ట ఆదివాసీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ చొరవతో ఇక్కడ 44మంది విద్యార్థుల కోసం గ్రామస్తులతో ఇటుకలు తయారు చేయించి రూ.3లక్షలతో స్కూల్‌ భవనం నిర్మించినట్లు తెలిపారు. ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, పీఆర్‌ ఏఈఈ శ్రీనివాస్‌, హౌజింగ్‌ ఏఈ హేమంత్‌, సర్పంచ్‌ సురేష్‌, ఉపసర్పంచ్‌ వెంకట్రావ్‌, పాఠశాల హెచ్‌ఎం భిక్షం, ఉపాధ్యాయులు రవికుమార్‌, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.

శిక్షణ కలెక్టర్‌ సౌరభ్‌శర్మకు వీడ్కోలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఐఏఎస్‌ అధి కారి సౌరభ్‌శర్మ ఏడాది పాటు శిక్షణ పూర్తయిన సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ.. దివ్యాంగుల పాఠశాల నిర్మాణానికి సౌరభ్‌శర్మ రూపొందించిన డిజైన్‌ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని అభినందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సికిల్‌సెల్‌ అనీమియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పరీక్షలు నిర్వహించడంలో ప్రత్యేక చొరవ చూపారని తెలిపా రు. అనంతరం సౌరభ్‌శర్మ మాట్లాడగా.. అధికారులు సన్మానించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపా ల్‌, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓ మధు, సీపీఓ సంజీవరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement