లారీకింద పడి మహిళ దుర్మరణ ం | - | Sakshi
Sakshi News home page

లారీకింద పడి మహిళ దుర్మరణ ం

Apr 2 2026 7:53 AM | Updated on Apr 2 2026 7:53 AM

దమ్మపేట: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతిచెందింది. మండలంలోని ముష్టిబండ శివారులో బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా, ఏ.కొండూరు మండలం, రేపూడి గ్రామానికి చెందిన నీలగిరి ఝాన్సీ (41),రవికుమార్‌ దంపతులు. ఝాన్సీ పుట్టిల్లు అయిన దమ్మపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ముష్టిబండ శివారుకు చేరుకోగా సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపునకు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బైక్‌పై నుంచి ఝూన్సీ రోడ్డుకు కుడి పక్కకు లారీటైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. రవికుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి. భార్య మృతదేహం చూసిన అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement