రూ.35.61 లక్షలకు మోరంపల్లిబంజర సంత వేలం | - | Sakshi
Sakshi News home page

రూ.35.61 లక్షలకు మోరంపల్లిబంజర సంత వేలం

Apr 2 2026 7:53 AM | Updated on Apr 2 2026 7:53 AM

బూర్గంపాడు: మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో ప్రతి శుక్రవారం నిర్వహించే పశువుల సంత, వారపు సంత వేలంపాటను బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ జమలారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్‌ బొర్రా సుభద్ర అధ్యక్షతన జీపీ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటను భద్రాచలానికి చెందిన భూక్యా రంజిత్‌నాయక్‌ రూ.35.61 లక్షలకు దక్కించుకున్నా రు. గతేడాది రూ.33.50 లక్షలకు సంత వేలం పాట ఖరారు కాగా ఈ ఏడాది రూ.35.61 లక్షలకు ఖరారైంది. ఉప సర్పంచ్‌ పొక్కుల రవి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్‌ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి

ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఆదేశాలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): క్షేత్రస్థాయిలో విద్యుత్‌ పనులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ జి.మహేందర్‌ బుధవా రం ఆదేశాలు జారీచేశారు. హెల్మెట్‌, హ్యాండ్‌ గ్లౌజ్‌, ఎర్త్‌ రాడ్‌ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయొద్దన్నారు. కొన్ని చోట్ల భద్రతా పరికరాలు ఉపయోగించకుండా పనిచేయడం వల్ల ప్రమాదా లు చోటుచేసుకుని, విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు బాధాకరమని పేర్కొ న్నారు. ఇకపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్సీ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

తహసీల్దార్‌, గిర్దావర్‌ మధ్య వాగ్వాదం?

ములకలపల్లి: ములకలపల్లి ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి, గిర్దావర్‌–2 భద్రు మధ్య ఓ భూమి పత్రాల విషయంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అన్నారం రెవెన్యూ పరిధిలోని ఓ భూమి పత్రాల విషయంలో నెలకొన్న సందిగ్ధతపై ఇరువురూ వాదనకు దిగిగగా తహసీల్దార్‌ వాహన డ్రైవర్‌, ఆమె సోదరు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో భద్రు తీవ్రంగా స్పందించాడని, తమ కార్యకలాపాల్లో బయటి వ్యక్తి ఎలా చేసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్‌ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా.. గిర్వావర్‌–2 భద్రు సైతం గతంలో ఓ ప్రైవేట్‌ వ్యక్తితో కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపించారు. తమను భద్రు అకారణంగా దూషించాడని, తన సోదరుడు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

గుండాల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆళ్లపల్లి మండలం ఇప్పనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల రాంబాబు, గొగ్గెల నందకిషోర్‌, ఈసం రమేశ్‌లు ఆళ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రామానుజగూడెం గ్రామానికి చెందిన రవి, పగిడిద్దరాజు ఆళ్లపల్లి నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. చింతోనిగుంపు పెట్రోల్‌ బంక్‌ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ సంఘటలో ఐదుగురు కిందపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవి, పగిడిద్దరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.

అశ్వారావుపేటలో..

అశ్వారావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన వెంకటపతి, మంగరాజుతోపాటు మరికొందరు కలిసి కొద్ది రోజులుగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో తాపీ పనులు చేస్తున్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం నుంచి తిరుమలకుంట గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలోని వినాయకపురం శివారులోని శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటపతి, మంగరాజును స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలించారు.

పినపాకలో..

పినపాక: కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బయ్యారం క్రాస్‌ రోడ్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఐలాపురం నుంచి ఉప్పాక వైపు ద్విచక్ర వాహనం వెళ్తుండగా మణుగూరు నుంచి జానంపేట వైపు కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఉప్పాక గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొండేరు తరుణ్‌ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు 108లో పినపాక ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement