అభివృద్ధి పనుల్లో వేగం ! | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం !

Mar 22 2026 1:52 AM | Updated on Mar 22 2026 1:52 AM

‘భద్రాచలం పునర్‌ నిర్మాణం,

పునరుజ్జీవం’ పేరుతో చర్చ

మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో ప్రభుత్వం

ప్లాన్‌లో పెరిగిన అంచనా వ్యయం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ‘భద్రాచలం పునర్‌ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో ఇక్కడ చేపట్టాల్సిన పనులపై మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం, సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో శ నివారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించారు. ప్రధాన ఆలయం, గోదావరి తీరం, పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ఇందులో చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి..

నాలుగు కాదు.. మూడు

గతంలో భద్రాచలం ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం రూ.350 కోట్లు కేటాయించాలని నిర్ణయించా రు. అందులో తొలివిడతలో రూ.100 కోట్లతో పను లు చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత నాలుగు దశల్లో వేర్వేరు విధాల పనుల కోసం మిగిలిన నిధులు ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ గత 12 ఏళ్లుగా భద్రాచలంలో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోవడం, నానాటికీ భక్తుల తాకిడి పెరగడంతో ముందుగా వేసిన అంచనాల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రాకు దీటుగా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెరిగిన భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని మూడు దశ ల్లోనే పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది.

పెరిగిన అంచనా వ్యయం

పుష్కరాల పనులను మినహాయించి భద్రాచలంలో ప్రధాన ఆలయం వద్ద వేర్వేరు పనుల కోసం ముందుగా నిర్ణయించిన రూ.350 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 560 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఇందులో తొలి విడత పనుల కోసం తక్షణమే రూ.200 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలు స్తోంది. గర్భగుడిని కదిలించకుండా ఈ నిధులతో లోపలి భాగంలో వివిధ పనులు, ఆలయ ప్రాకారం, మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పనులకు సుమారు రూ.120కోట్ల వరకు వ్యయం కానుండగా మిగిలిన నిధులతో క్యూ లైన్ల నిర్వహణ, సామూహిక వసతి, బస, రోడ్ల విస్తరణ, పార్కింగ్‌ తదితర పనులు ఉంటాయి. ఈనెల 27న శ్రీరామనవమి రోజున పనులు ప్రారంభించి 2027 జూలైలో పుష్కరాల నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి..

రెండు, మూడు దశల్లో ప్రస్తుతం ఉన్న కల్యాణ మండపం (మిథిలా స్టేడియం) పునరుద్ధరణతో పాటు పట్టణంలో శాశ్వత ప్రాతిపదికన భక్తులు/పర్యాటకులకు ఆధ్యాత్మక, పర్యాటక పరంగా సౌకర్యాలు కల్పించేలా పనుల చేపట్టేందుకు వీలుగా అంచనాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం దేశంలో పేరెన్నిక గల కన్సల్టెన్సీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు. పుష్కరాల నాటికి ప్రధాన ఆలయం వద్ద చేపట్టే తొలి విడత పనులు పూర్తయితే, ఆ తర్వాత రెండు, మూడో విడత పనులు చేపట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మేడారం, భద్రాచలంలో చూపించిన మార్పులు తమకు లాభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement