● జిల్లాలోని 963 గ్రామాల పరిధిలో 1,91,092 మందికి సాయం ● నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో యాసంగి పంటలు కోత దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లోపే వానాకాలం సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా సాయానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం నుంచి విడతల వారీగా రైతు భరోసా విడుదల చేయాలని నిర్ణయించింది.
1,91,092 మంది రైతులు అర్హులు..
జిల్లాలో యాసంగిలో 23 మండలాల్లోని 963 గ్రామాలకు చెందిన 1,91,092 మంది రైతు భరోసా ఆర్థిక సాయానికి అర్హులని అధికారిక గణాంకాలు తేల్చాయి. ఈ మేరకు జిల్లాకు రూ.337,17,46, 387 విడుదల కావాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2 వేల మందికి పైగా రైతులు కొత్తగా నమోదయ్యారు. ఇంకా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.


