అటవీ సంరక్షణకు కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

అటవీ సంరక్షణకు కృషి చేయండి

Mar 22 2026 1:52 AM | Updated on Mar 22 2026 1:52 AM

● జిల్లాను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలి ● ఫారెస్ట్‌ సిబ్బందికి ఎస్పీ రోహిత్‌రాజ్‌ పిలుపు

● జిల్లాను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలి ● ఫారెస్ట్‌ సిబ్బందికి ఎస్పీ రోహిత్‌రాజ్‌ పిలుపు

పాల్వంచరూరల్‌: దేశంలోనే జిల్లా అటవీ ప్రాంతా న్ని ఉత్తమంగా తీర్చిదిద్దాలని, ఈ మేరకు అధికా రులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ పిలుపునిచ్చారు. అటవీ సంరక్షణతోనే సమాజాన్ని కాపాడగలమని చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్స వం సందర్భంగా వైల్డ్‌లైఫ్‌ ఆధ్వర్యంలో కిన్నెరసానిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న కాలా నికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించే విషయంలో ఎక్కువ మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించా లని చెప్పారు. అటవీ – పోలీస్‌ శాఖలు ఎప్పు డూ సమన్వయంతోనే పని చేస్తున్నాయని తెలి పారు. మహిళా ఉద్యోగులను ఎవరైనా వేధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో నివసించే వారికి ఆర్థిక వనరులను సృష్టించి అందించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎఫ్‌ఓ జి.కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం, అటవీ సిబ్బంది జిల్లాలో ఉన్నారని, అడవుల్లో ఉండే జంతువులు, వృక్ష సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. సమాజంలో అందరికంటే ఎక్కువ భాద్యత అటవీ శాఖపైనే ఉందన్నారు. జిల్లాలో సారవంతమైన అడవి ఉందని, తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.20కోట్ల ఆదా యం అందిస్తున్నామని, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే రూ.1000కోట్ల ఆదాయం అందించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ లు బి.బాబు, కట్టా దామోదర్‌రెడ్డి, సుజాత, కోటేశ్వరరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement