భద్రాచలం: భద్రగిరి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. ఉగాది, రంజాన్‌తో పాటు వా రాంతపు సెలవులు వరుసగా రావడంతో భక్తులంతా భద్రాచలం బాట పట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానా లను ఆచరించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
జోరుగా టికెట్ల విక్రయాలు
శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వెబ్‌సైట్‌లో ఉంచిన టికెట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. శనివా రం నాటికి 3ఏ సెక్టార్‌లోని రూ.7,500 విలువైప ఉభయదాతల టికెట్లు 400కు గాను 293 అమ్ముడుపోగా 107 మాత్ర మే మిగిలి ఉన్నాయి. రూ.2,500 విలువైన సెక్టార్ 3బీ టికెట్లు 550కి 419, రూ.2వేల విలువైన సెక్టార్ 3సీ 190కి 30 మాత్రమే ఉన్నాయి. ఇక రూ.1000 విలువైన సెక్టార్ 3డీలో 85 పూర్తిగా అమ్ముడు పోగా, 3ఈలో 315కు 19, 3 ఎఫ్‌లో 390కి 321 టికెట్లు ఉన్నాయి. సెక్టార్ 4ఏలో రూ. 300 విలువైన టికెట్లు 368కి మొత్తం, సెక్టార్ 4బీ లో రూ.300వి 385కు 385, సెక్టార్ 4సీలో 295కు 144 టికెట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ.150 విలువైన టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో వేగంగా నవమి టికెట్ల విక్రయం


