మెరుగైన నైపుణ్యంతోనే అవకాశాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటే యువత భవి ష్యత్ అభివృద్ధిపథంలో నడుస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో అప్రెంటిస్‌షిప్, బ్యాచిలర్ / డిప్లొమా ఇన్–ఒకేషనల్ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణ కోసం నిర్వహించిన ఓరిఝెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాల ను పెంపొందించుకోవాలని, అప్పుడే ఉపాధి అవకా శాలు పెరుగుతాయని చెప్పారు. యువతలో వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకే ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ సౌకర్యం, 100శాతం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మల్టీ స్కిల్స్ అవసరమని, యువత నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తాను పేద కుటుంబం నుంచే వచ్చానని, తన తండ్రి ఐటీఐ చదివారని, కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరని అన్నారు. తాను ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో పనులు చేశానని గుర్తు చేసుకున్నా రు. ప్రస్తుతం హాజరుకాలేకపోయిన అభ్యర్థుల కోసం ఈనెల 21న మరోసారి శిక్షణ, ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి 107 మంది యువకులు హాజరుకాగా, వీరిలో 92 మంది వివరాలు నమో దు చేసుకున్నారని, వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించి 57 మందిని వివిధ పరిశ్రమలకు ఎంపిక చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఆర్‌ఎఫ్‌కంపెనీ సూ పర్‌వైజర్ అమృత్ రాజు, రానె మద్రాస్ కంపెనీ రిక్రూట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్ బి. స్వజిట్ ఖుంటియా, సెర్ప్ నుంచి బి. నీలయ్య, ఏపీఎంలు ఎల్. వెంకయ్య, జి. ప్రసాద్ రెడ్డి, ఏ. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


