చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

Dec 29 2025 7:58 AM | Updated on Dec 29 2025 7:58 AM

చదువు

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

ఎంతో సంతోషంగా ఉంది.. సౌకర్యాలు లేకున్నా చదివాను.. విద్యార్థులను కలవడం ఆనందంగా ఉంది.. ఉత్తరాలు టీచర్లు చదివేవారు.. క్రమశిక్షణతో నేర్చుకున్నాం..

50 ఏళ్ల క్రితం నాటిన

మొక్క మహావృక్షమైంది

స్వర్ణోత్సవాల్లో కలెక్టర్‌ జితేశ్‌

వి.పాటిల్‌, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌

పాల్వంచరూరల్‌: విద్యాలయాల్లో సౌకర్యాలు ఉన్నా, లేకున్నా.. చదువుకోవాలనే పట్టుదల ఉండాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడని కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఐటీడీఐ పీఓ బి.రాహుల్‌ అన్నారు. మండలంలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌ గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా పూర్వ విదార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ఆదివారం వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గిరిజన గురుకులంలో 50 ఏళ్ల క్రితం నాటిన మొక్క మహావృక్షమైందన్నారు. విద్యార్థులు ఉన్న వనరులు, అవకాశాలను వినియోగించుకుంటూ చదువుకోవాలనే కసి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కాగా, కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌, ఐటీడీఏ పీఓలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ ఉపాధ్యాయులు ఎన్‌.చక్రవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌సీఓ అరుణకుమారి, ఏపీఓ డేవిడ్‌రాజు, ప్రిన్సిపాల్‌ రమేశ్‌, ఎస్‌.శ్యామ్‌కుమార్‌, ఖాదర్‌, రమేశ్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.

ఆత్మీయ పలకరింపులు..

కిన్నెరసాని గిరిజన గురుకుల స్వర్ణోత్సవాల సందర్భంగా ఏపీ, తెలంగాణ నలుమూలల నుంచే కాకు ండా విదేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులు, పూర్వ గురువులు (వజ్జ) కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 1975లో ఇక్కడ చదువుకుని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాల కోసం నేను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నుంచి వచ్చాను. 1988లో పదో తరగతి చదివాను. పూర్వ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలలో రూ.2.50 లక్షలతో వేదికను నిర్మాణం చేశాను.

–తేజావత్‌ జానకీరామ్‌ (ఎన్‌ఆర్‌ఐ)

నాడు పాఠశాలలో సౌకర్యాలు లేకున్నా నాటి గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నాను. ప్రతీ రోజు వేకువజామున నిద్ర లేచి చదువుకునే వాళ్లం. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాను. అప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా చదువుపై దృష్టి సారించడం లేదు.

– రవికిరణ్‌కుమార్‌, యూఎస్‌ఏ

40 సంవత్సరాల క్రితం ఇక్కడ విద్యార్థులకు బోధన చేసి విరమణ పొందాడు. నాటి వి ద్యార్థులను కలుసుకునేందుకు స్వర్ణోత్సవాలకు వచ్చాను. నాటి విద్యార్థులను కలుసుకుని, అప్పటి ఘటనలను గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.

– ప్రభాకర్‌రెడ్డి, పూర్వ ఉపాధ్యాయులు, చిత్తూరు

గురుకులంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థి నేను. నాడు ఇంటికి ఉత్తరం రాసినా, ఉత్తరం ఇంటి నుంచి వచ్చినా టీచర్లు వాటిని అందరి సమక్షంలో చదివి వినిపించేవారు. ఎంతో క్రమశిక్షణతో విద్యాబోధన అందించారు.

– అభిమన్యుడు, రిటైర్డ్‌ జేడీఏ

గురుకులంలో మొదటి బ్యాచ్‌ మాది. అప్పుడు క్రమశిక్షణతో చదువుకున్నాం. పాఠశాల చుట్టూ అడవి ఉండేది. రాత్రి సమయంలో జంతువుల అరుపులు వినిపించేవి. నాటి గురువుల బోధనల మూలంగా చాలామంది ఉద్యోగాలు సాధించారు.

– బుర్ర చంద్రశేఖర్‌, పూర్వ విద్యార్థి

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 1
1/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 2
2/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 3
3/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 4
4/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 5
5/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 6
6/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 7
7/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 8
8/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి.. 9
9/9

చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement