భద్రాద్రి రామయ్య సేవలో అదనపు కమిషనర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ముఖ్య ఉత్సవ అధికారి ఈ.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. చిత్రకూట మండపంలో ఆయనకు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఈఓ దామోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, రవీందర్, భవానీరామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.
ముక్కోటి ఉత్సవాల్లో ‘కళా’కాంతులు
భద్రాచలంటౌన్: భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరం ఆదివారం సందర్శకులతో నిండిపోయింది. ఏరు ఉత్సవాల సందర్భంగా నదీ తీరంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ ఆర్ట్ స్పేస్’సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టా రు. ప్రత్యక్ష చిత్రలేఖనం (లైవ్ పెయింటింగ్) ద్వారా భక్తి భావాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.
కిన్నెరసానిలో సందడి
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 975 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.51,515 ఆదా యం.. 550 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.27,680 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
30న ‘పీఎంశ్రీ’
క్రీడా పోటీలు
కొత్తగూడెంఅర్బన్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈ నెల 30న పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ బి. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అంశాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టును కూడా ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వి.నరేష్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని వివరించారు.
పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరిన యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,417.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 420 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 980 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించి సరఫరా చేశారు.
ఇసుక నిల్వలు సీజ్
ములకలపల్లి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గిర్ధావర్ – 2 భద్రు కథనం ప్రకారం.. మండలంలోని సీతారాంపురం శివారులో ఇసుక అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందగా దాడులు నిర్వహించి, 6 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని భద్రు వివరించారు.
భద్రాద్రి రామయ్య సేవలో అదనపు కమిషనర్
భద్రాద్రి రామయ్య సేవలో అదనపు కమిషనర్
భద్రాద్రి రామయ్య సేవలో అదనపు కమిషనర్


