అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు
భద్రాచలం: ఏజెన్సీలోని అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజన నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల నిమిత్తం ఐటీడీఏ అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు, నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాలని అన్నారు. దీనికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అశోక్, ఈఈ మధుకర్, అధికారులు లక్ష్మీనారాయణ, వేణు, ఉదయ్‌కుమార్, ఆదినారాయణ, అనసూయ పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం..
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను టీజీ గురుకుల వైబ్‌సైట్‌లో జనవరి 21లోపు అప్‌లోడ్ చేయాలని, వివరాలకు సమీప గురుకులాల్లో సంప్రదించాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


