జాతీయస్థాయి క్రీడల్లో ఐటీడీఏ జట్ల హవా
భద్రాచలంటౌన్ : ఏపీలోని విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పెసా క్రీడా పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ క్రీడాకారులు హవా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పీఓ రాహుల్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఐటీడీఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషుల, మహిళల కబడ్డీ జట్లు తొలి లీగ్ మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించాయని తెలిపారు. పురుషుల విభాగంలో జరిగిన పోటీలో మహారాష్ట్ర జట్టుపై తెలంగాణ జట్టు విజయం సాధించగా, మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయకేతనం ఎగురవేసిందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను, కోచ్‌లను పీఓ అభినందించారు. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


