టర్మినేట్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు
కొత్తగూడెంఅర్బన్: వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ)లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. హైపవర్ కమిటీ సభ్యులు, జీఎంలు ఏ.మనోహర్, కే.సాయిబాబు, కవితా నాయుడు, ఆర్.విజయ ప్రసాద్, బొజ్జ రవి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం టర్మినేట్ అయిన ఉద్యోగులను తిరిగి నియమిస్తున్నట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 34 మందిని ఇంటర్యూలకు పిలువగా 33 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు అజయ్ కుమార్, జాఫర్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.


