‘స్మార్ట్’గా ప్రచారం
గరిష్టం / కనిష్టం
290 / 120
వాతావరణ ం
జిల్లాలో సోమవారం మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
భద్రాచలంఅర్బన్: మొదటి, రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎక్కువగా వాల్, డోర్ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడక్కడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా ఎక్కువగా సోషల్‌మీడియా ద్వారానే ప్రచారం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోనే ప్రచార ఆయుధంగా మారిపోయింది. పంచాయతీలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులపై పాటలు, గ్రామానికి గతంలో చేసిన సేవలు, ఇచ్చే హామీలను వివరిస్తూ ఆడియో, వీడియో పోస్టులు పెడుతున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు, మైకులతో ప్రచారానికి అనుమతులు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో పెద్దగా అనుమతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారి అనుచరులు పోస్టులతో గ్రూపులను పోటెత్తిస్తున్నారు.
సోషల్ మీడియాపై నిఘా
ఒకవైపు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. రెచ్చగొట్టే, ఇతరులను నిందించే, అసభ్యకరంగా ఉండే పోస్టులు పెడితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు


