రెండో విడత బరిలో 3,206 మంది ..
మండలాల వారీగా అభ్యర్థుల సంఖ్య
చుంచుపల్లి: రెండో విడత ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల్లోని 155 గ్రామ పంచాయతీలు 1,384 వార్డులకు శనివారంతో ఉపసంహరణ గడువు ముగియగా, బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలింది. 154 గ్రామ పంచాయతీల్లో 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించలేదు. మిగిలిన 138 గ్రామ పంచాయతీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 1,384 వార్డులకు 248 వార్డులు ఏకగ్రీవం కాగా, 13 వార్డులకు అసలు నామినేషన్లు రాలేదు. మిగతా 1,123 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, 2,820 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం మీద మలి విడతలో 3,206 మంది అభ్యర్థులు పోరుకు సిద్ధమయ్యారు. గుర్తులు ప్రకటించటంతో ఆదివారం నుంచి అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. తమకే ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
మండలం పేరు సర్పంచ్ వార్డు
అన్నపురెడ్డిపల్లి 24 182
అశ్వారావుపేట 66 459
చండ్రుగొండ 33 237
చుంచుపల్లి 52 420
దమ్మపేట 76 556
ములకలపల్లి 69 402
పాల్వంచ 66 564


