ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు అక్రమంగా మద్యం, నగదు రవాణా చేస్తుంటారని, అలాంటి వాటిని అరికట్టాలని ఎస్పీ రోహిత్‌రాజు సిబ్బందికి సూచించారు. భద్రాచలం బ్రిడ్జి పాయింట్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అందుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ సతీష్ తదితరులు ఉన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు


