ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించాలి
ములకలపల్లి: ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా నోడల్ అధికారి ఎ.శ్రీనివాసరావు సూచించారు. ములకలపల్లి రైతువేదికలో అభ్యర్థులకు సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు తప్పుడు లెక్కలు చూపినా, అసలు లెక్క చూపకున్నా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేయొద్దని సూచించారు. చేసే ప్రతీ ఖర్చుకు విధిగా రశీదులు తీసుకోవాలన్నారు. సదస్సులో సహాయ వ్యయ పరిశీలకురాలు పి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.


