యాసంగిలో ఎరువుల అవసరం | - | Sakshi
Sakshi News home page

యాసంగిలో ఎరువుల అవసరం

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

యాసంగిలో ఎరువుల అవసరం

యాసంగిలో ఎరువుల అవసరం

నెల వారీగా అవసరమైన ఎరువుల(మెట్రిక్‌ టన్నుల్లో) వివరాలు

72,397ఎంటీ

ఇప్పటికే 23,212 మెట్రిక్‌ టన్ను(ఎంటీ)ల నిల్వ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): యాసంగి వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులపై దృష్టి సారించింది. గత యాసంగిలో పంటల సాధారణ విస్తీర్ణం 1,21,857 ఎకరాలుకాగా ఈసారి 1,56,667 ఎకరాలుగా అంచనా వేసింది. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లెక్కల తేల్చింది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు యూరియా 28,273 మెట్రిక్‌ టన్నులు(ఎంటీ), డీఏపీ 5,443 మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 3,922 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 32,657 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ 3,103 మెట్రిక్‌ టన్నులు.. మొత్తంగా 72,397 మెట్రిక్‌ టన్నులు అవసరమని నిర్ధారించారు. ఇప్పటివరకు 23,212 మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

యూరియా కొరత నివారిస్తారా?

గత వానాకాలం సీజన్‌లో యూరియా కొరతతో రైతులు అవస్థ పడ్డారు. రేయింబవళ్లు పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు కాశారు. యా సంగి సీజన్‌లో అధికారుల అంచనాల ప్రకారం కాంప్లెక్స్‌ ఎరువుల తర్వాత యూరి యా వినియోగమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో యారియా కొరత లేకుండా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

నెల యూరియా డీఏపీ పొటాష్‌ కాంప్లెక్స్‌ పాస్ఫేట్‌

అక్టోబర్‌ 6,381 1,137 1,053 7,170 503

నవంబర్‌ 2,685 812 524 5,724 325

డిసెంబర్‌ 3,900 1,364 577 5,499 611

జనవరి 7,120 1,392 691 7,716 814

ఫిబ్రవరి 5,190 592 640 4,843 493

మార్చి 2,997 146 437 1,705 457

మొత్తం 28,273 5,443 3,922 32,657 3,103

నిల్వ 7,264 1,653 1,365 10,625 2,305

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement