వైభవంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రామయ్య కల్యాణం

Oct 17 2025 6:06 AM | Updated on Oct 17 2025 6:06 AM

వైభవం

వైభవంగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి గురువారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌ శర్మ పాల్గొన్నారు.

నేడు మంత్రి తుమ్మల పర్యటన

దమ్మపేట: అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెంలో ఉన్న ఆయిల్‌ ఫెడ్‌ నర్సరీని నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సందర్శించనున్నారని పామాయిల్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపాటి ప్రసాద్‌ కోరారు. గురువారం మండలంలోని అల్లిపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పామాయిల్‌ మొక్కలకు తెగుళ్లు, అంటువ్యాధులు సోకకుండా మొక్క దశ నుంచే నర్సరీలో చేపట్టే చర్యల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని అన్నారు. రైతులు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. కాంగ్రెస్‌ నాయకులు దొడ్డా ప్రసాద్‌, కేవీ, అడపా రాంబాబు, మన్నెం అప్పారావు పాల్గొన్నారు.

‘ఎర్త్‌ సైన్సెస్‌’కు మన్మోహన్‌ సింగ్‌ పేరు

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెంలో ఇటీవల ప్రారంభమైన ఎర్త్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పేరు పెడుతూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీర్మానించారు. సుమారు 300 ఎకరాల్లో రూపుదిద్దుకొంటుండగా, ఇక నుంచి మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యావకాశాలను విస్తృతం చేయడంతోపాటు రాష్ట్రానికి కొత్త దిశను చూపించనున్న యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేరు పెట్టడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నేడు దీపావళి బోనస్‌

ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షలు

చెల్లించనున్న సింగరేణి

కొత్తగూడెంఅర్బన్‌: సింగరేణి కార్మికులకు నేడు దీపావళి బోనస్‌ అందనుంది. ఏటా యాజమాన్యం పెర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ రివార్డు(పీఎల్‌ఆర్‌) బోనస్‌ను దీపావళి ముందు అందజేస్తుంది. ఈసారి ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షలు ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానుంది. కాగా ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకూ బోనస్‌ ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 20న దీపావళి సందర్భంగా యాజమాన్యం చెల్లింపు సెలవుగా ప్రకటించింది. 20న అన్నీ గనులు, విభాగాలు బంద్‌ ఉండనుండగా, చెల్లింపు సెలవు రోజుగా ప్రకటించి అత్యవసర కార్మికులకు మాత్రం మూడు రెట్ల వేతనం చెల్లించనున్నారు. పీఎల్‌ఆర్‌ బోనస్‌ 2023లో రూ.85,500, 2024లో రూ.93,750 చెల్లించారు. ఈ ఏడాది రూ. 9,250 పెంచి ఒక్కో కార్మికుడికి రూ.1,03,000 చెల్లించనున్నారు.

వైభవంగా  రామయ్య కల్యాణం1
1/1

వైభవంగా రామయ్య కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement