
గురుకులాల్లో మౌలిక వసతులు
పాల్వంచరూరల్: గిరిజన విద్యార్థుల సమగ్రాభివృద్ధికోసం మౌలిక వసతులు కల్పిస్తానని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహారి, అదనపు తరగతిగదులు మంజూరు చేస్తామని, క్రీడా మైదానాన్నిఅభివృద్ధి చేస్తామని తెలిపారు. పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలని, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు టెబుల్ టెన్నిస్ సామగ్రిని అందజేశారు. ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్ ఎస్.శ్యామ్‌కుమార్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్