చుంచుపల్లి: మండలంలోని రుద్రంపూర్ క్లబ్ ఏరియాలో బుధవారం రాత్రి మోజెస్ ఇంట్లోకి సుమారు 9 అడుగుల పొడవైన కొండచిలువ రావడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. స్థానికుల సమాచారం మేరకు ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపడు, కొత్తగూడెం స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్, సభ్యుడు నారదాసు శ్రీకాంత్‌తో ఆక్కడకు చేరుకుని కొండచిలువ (ఇండియన్ రాక్‌పైథాన్)ను బంధించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులతో కలిసి అర్ధరాత్రి అడవిలో వదిలేశారు. మదర్ థెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు గుడెల్లి యాకయ్య, బండ శంకర్, మురళి, శ్రీనివాస్, సలీం, తరుణ్, ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.