
ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి వేంటేశ్వరస్వామి ఆలయంలో హుండీలోని నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల కథనం మేరకు.. గత మంగళవారం రాత్రి శ్రీనివాసకాలనీలోని గుట్టపై గల వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశంచి, హుండీ తాళాలు పగులగొట్టి సుమారు రూ.3 వేల నగదును చోరీ చేశాడు. అక్కడ పనిచేసే వ్యక్తులకు చెందిన రెండు సెల్‌ఫోన్‌లు, పర్సులోని రూ.1,500 నగదునూ అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో గురువారం కిన్నెరసానిరోడ్‌లో గుడ్‌మార్నింగ్ హోటల్ వద్ద సదరు వ్యక్తిని గుర్తించిన గుడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలో అదే దొంగ ఆలయంలో పలుమార్లు చోరీకి పాల్పడినట్లు సమాచారం.