
పరీక్షలకు సిద్ధం చేయాలి
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో హెచ్‌ఎంలు, వార్డెన్‌లతో సమీక్షా సమావేశం జరిపారు. పాఠశాలల పనితీరు, మౌలిక వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ముందస్తుగా సిలబస్ పూర్తి చేసి మోడల్ పరీక్షా పత్రాలతో సంసిద్ధులను చేయాలన్నారు. కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పురాతన భవనాలు, పాఠశాలను వివరాలను అందించాలని, అవసరమైనచోట మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మెలో ఉన్న డైలీవేజ్ వర్కర్లు ఈ నెల 20 తేదీలోగా విధుల్లోకి రాకపోతే కొత్తగా వర్కర్లను నియమించుకోవాలన్నారు. ఈ నెల 17,18వ తేదీల్లో డివిజన్‌స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని పీఓ మరో ప్రకటనలో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు అశోక్, మధుకర్, సమ్మయ్య, రమేష్, చంద్రమోహన్, భారతీదేవి, అలివేలు మంగతాయారు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్