
వర్క్‌షాప్‌లో నూతన యంత్రం ప్రారంభం
కొత్తగూడెంఅర్బన్: సెంట్రల్ వర్క్ షాప్‌లో అత్యాధునిక ఎల్–45 లేత్ యంత్రాన్ని శుక్రవారం సెంట్రల్ వర్క్‌షాప్ జీఎం (ఈ–ఎం) ఎన్.దామోదరరావు ప్రారంభించి, మాట్లాడారు. రూ.1.45 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఎల్–45 లేత్ మెషిన్ సాయంతో వేగం, కచ్చితత్వంతో కూడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలో వాడే డ్రమ్ము హబ్బులు, ఫ్యాన్ సాఫ్ట్‌లను తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని చేయవచ్చని చెప్పారు. కార్యక్రమములో ఏజీఎం (ఈ–ఎం) మెయిన్ వర్క్‌షాప్ పి.రాజీవ్‌కుమార్, అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, అప్రెంటిస్ విద్యార్థులు పాల్గొన్నారు.