
పంటల్లో తెగుళ్ల బెడద
● దిగుబడిపై రైతుల్లో ఆందోళన ● యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తల సలహాలు
సూపర్‌బజార్
(కొత్తగూడెం): వాతావరణ పరిస్థితుల్లో రోజుకో రకంగా ఉంటున్నాయి. కొద్దిరోజుల పాటు ఎడతెగకుండా వర్షాలు కురి శాయి. ప్రస్తుతం మధ్యాహ్నం ఎండగా ఉంటున్నా సాయంత్రం మంచుప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యాన వివిధ పంటలను తెగుళ్లు ఆశిస్తుండగా దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈమేరకు వివిధ పంటల్లో తీసుకోవాల్సి న యాజమాన్య పద్ధతులను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డి నేటర్ డాక్టర్ టి.భరత్ వెల్లడించారు.
వరి
అధిక తేమతో కూడిన వాతావరణం వరిలో మానుపండు తెగులు సోకడానికి అనుకూలం. ఈ లక్షణా లు కనిపిస్తే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు 0.4గ్రాములు + ట్రైపోసెక్సీస్ట్రెబిన్ టేబుకోన జోల్ లేదా ఒక ఎం.ఎల్. ప్రొఫైకోనజోల్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంటలో పాము పొడ తెగులు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక ఒక మి.లీ. ప్రొపికోనజోల్‌ను లీటర్ నీటిలో కలిపి 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే, వరిలో సుడిదోమ ఆశిస్తే నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 0.6 గ్రాముల పైమెట్రోజిన్ లేదా 0.48 మి.లీ. టేప్లోమేజపైరిన్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇంకా కంకి నల్లి ఆశిస్తే ఒక మి.లీ. స్ప్రైరోమైసిపిన్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, బాక్టీరియా ఎండు తెగులు ఉధృతి కనిపిస్తే ఎకరానికి 400 గ్రాముల కాపర్ హైడ్రాకై ్సడ్, స్టేపీటోమైసిన్ సల్ఫైడ్ 60 గ్రాములు అందిస్తూ.. యూరియా మోతాదును తగ్గించి నీటిని తడి – పొడి విధానంలో అందించాలి. అయితే, ఈ తెగులుకు పూర్తిగా నివారించడానికి సరైన మందులు లేవు.
పత్తి
ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ. ప్రోఫినోపాస్ లేదా 1.5 గ్రాముల దియోడికార్బ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే, ఎకరానికి 5 – 6 లింగాకర్షణ బుట్టలు అమరిస్తే పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అలాగే, పత్తిలో కాయకుళ్లు లక్షణాలు గమనిస్తే వర్షాలు తగ్గాక 0.2 గ్రాముల ప్లాంటమైసిన్ + 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి
అపరాలు
వెచ్చటి గాలి, అధిక తేమ వాతావరణ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము పంటలను మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆనవాళ్లను గమనిస్తే వర్షాలు తగ్గిన తర్వా త నివారణకు ఒక మి.లీ. నోవాలురాన్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి
కూరగాయలు
●టమాట పంటలో సూది పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు 0.3 మి.లీ. స్పైనో సాడే లేదా 0.2 మి.లీ. ఇండాక్సికార్బ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక వంగలో కొమ్మ, కాయ తులసి పురుగు ఆశిస్తే 0.4 గ్రాముల ఇమామెక్టేన్ బెంజ్యోట్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి

పంటల్లో తెగుళ్ల బెడద