బాణసంచా.. భద్రతాచర్యలు | - | Sakshi
Sakshi News home page

బాణసంచా.. భద్రతాచర్యలు

Oct 17 2025 6:06 AM | Updated on Oct 17 2025 6:06 AM

బాణసంచా.. భద్రతాచర్యలు

బాణసంచా.. భద్రతాచర్యలు

● జిల్లా వ్యాప్తంగా దుకాణాల ఏర్పాట్లు ● మొదలైన అనుమతుల ప్రక్రియ ● ఈసారి ఖర్చు పెరిగిందంటున్న వ్యాపారులు ● ఫైర్‌ సేఫ్టీ నిబంధనల అమలుపై దృష్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హద్దు మీరితే చర్యలు

నిబంధనలు పాటించాలి

● జిల్లా వ్యాప్తంగా దుకాణాల ఏర్పాట్లు ● మొదలైన అనుమతుల ప్రక్రియ ● ఈసారి ఖర్చు పెరిగిందంటున్న వ్యాపారులు ● ఫైర్‌ సేఫ్టీ నిబంధనల అమలుపై దృష్టి

● దుకాణం ఓపెన్‌ ఏరియాలో అనుమతి పొందిన ప్రదేశంలో ఉండాలి.

● నిర్మాణం క్లాత్‌ వుడ్‌ టార్పాలిన్‌ లాంటి కాలే వస్తువులతో చేయకూడదు.

● నాణ్యమైన వైరుతో ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ చేయాలి. అతుకులు లేకుండా ఉండే విధంగా క్వాలిఫైడ్‌ ఎలక్ట్రీషియన్‌తో వైరింగ్‌ చేయించాలి.

● 2 నంబర్‌ డీసీపీ ఫైర్‌ ఎక్స్టింగ్విషర్స్‌ ఉండాలి.

● రెండు వాటర్‌ బ్యారెల్స్‌ (ఒకటి 200 లీటర్స్‌) ఉండాలి.

● స్మోకింగ్‌ నిషేధం అని బోర్డులు ఏర్పాటు చేయాలి.

● స్పార్క్‌ వచ్చే ఎలాంటి ఎక్విప్మెంట్‌ వాడకూడదు.

● 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టకూడదు.

● షాప్‌లో, చుట్టూ ప్రదేశంలో శుభ్రత పాటించాలి.

● రెండు షాప్‌ల మధ్య 3 మీటర్ల గ్యాప్‌ ఉండేలా చూడాలి.

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దీపావళి పండగ సందర్భంగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి బాణసంచా విక్రయాలు సాగించే వ్యాపారులు రెవెన్యూ, మున్సిపాలిటీ / గ్రామపంచాయతీ, విద్యుత్‌, అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో కొత్తగూడెంలో 38, రుద్రంపూర్‌ 01, రామవరం 04, జూలురుపాడు 02, చండ్రుగొండ 02, ఇల్లెందు 28, మణుగూరు 16, పాల్వంచ 12, భద్రాచలం 8, చర్ల 4, సారపాక 1, బూర్గంపాడు 2, అశ్వారావుపేటలో 16 వంతున షాపుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమతులు వచ్చిన తర్వాత ఎంపిక చేసిన మైదానం/ఖాళీ ప్రదేశంలో దుకాణదారులు తాత్కాలిక షాపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలు పాటించడంలో ఈ దుకాణాల దగ్గర నిర్లక్ష్యం కనిపిస్తుంటుంది.

పెరిగిన ఖర్చు

బాణసంచా వ్యాపారులు ఖర్చులు తగ్గించుకునేందుకు కలిసికట్టుగా (సిండికేట్‌) దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో మండల కేంద్రాల్లో ఒక్కో దుకాణం ఏర్పాటుకు కనిష్టంగా రూ.40 వేలు ఖర్చవుతుండగా పట్టణాల్లో ఇది రూ.60 వేలకు చేరుకుంది. ఇందులో అనుమతుల కోసం వేర్వేరు ప్రభుత్వశాఖలకు చలాన్ల రూపంలో చెల్లించే సొమ్ము రూ.2 వేలలోపు ఉండగా అద్దె రమారమీ రూ.5వేల వరకు ఉంది. షెడ్డు నిర్మాణం, జనరేటర్‌, విద్యుత్‌ బిల్లుల ఖర్చు రూ.10 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తంగా దుకాణం ఏర్పాటుకు రూ. 30వేలకు అటుఇటుగా ఖర్చు వస్తోంది. అయినా ఒక్కో దుకాణం ఏర్పాటు కోసం అదనంగా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ముడుపుల కోసమే అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన ఖర్చుల ప్రభావం ఫైర్‌సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందంటున్నారు.

అనుమతుల్లో చేతివాటం?

జిల్లాలో ఓ మున్సిపాలిటీ పరిధిలో బాణసంచా దుకాణం పర్మిషన్‌ కోసం రెవెన్యూ సిబ్బంది ఒక్కో షాపునకు రూ.5,000 డిమాండ్‌ చేసినట్టు సమాచారం. అంత ముట్టచెప్పుకోలేమని వ్యాపారులు చెప్పడంతో అనుమతుల ప్రక్రియను సదరు అధికారి తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో బాణసంచా సిండికేట్‌ సదరు అధికారికి ఎదురు తిరిగి అనుమతుల కోసం పైఅధికారి దగ్గరకు వెళ్తామని చెప్పడంతో చివరకు డీల్‌ రూ.3,000 దగ్గర కుదిరినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర శాఖల్లోనూ ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

అనుమతులు లేకుండా టపాసులను విక్రయించినా, నిల్వ చేసినా చర్యలు తీసుకుంటాం. క్లస్టర్‌లో యాభై షాపులకు మించి ఉండకూడదు. ఇళ్ల మధ్య, కల్యాణ మంటపాలు, సమావేశ మందిరాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయొద్దు.

–అబ్దుల్‌ రెహమాన్‌, డీఎస్పీ, కొత్తగూడెం

తాత్కాలిక టపాకాయల దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలి. జాగ్రత్తలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు అందరూ సహకరించాలి.

–మురహరి క్రాంతి కుమార్‌, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement