
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఉన్న అరుగుపై మృతదేహం ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో భిక్షాటన చేసుకుని జీవిస్తుండేవాడని, అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు తెలుపు రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కుడి చేతిపై హిందీలో పచ్చ బొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మార్చురీలో ఉంచామని, వివరాలు తెలిస్తే 87126 82106, 87126 82105లో సంప్రదించాలని టౌన్ సీఐ నాగరాజు కోరారు.